మే 13న ప్రధాని మోదీ నామినేషన్!

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బీజేపీ తరపున వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందు కోసం ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 13న ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు యూపీ బీజేపీ వర్గాలు వెల్లడిరచాయి. ర్యాలీకి ముందు ఆయన కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోనున్నట్లు సమాచారం. అనంతరం వారణాసిలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. మోదీ నామినేషన్ కోసం ఇప్పటికే పార్టీ రాష్ట్ర యూనిట్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. వారణాసి నియోజకవర్గానికి చివరివిడతో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. మే 7న నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు సమర్పించేందుకు గడువు ఉంది. దీనికి ఒకరోజు ముందు మోదీ తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.