సంపన్న దేశాలదే ఆ పాపం..
అభివృద్ధి చెందిన దేశాల నుంచే కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెలువడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన మట్టిని కాపాడుకుందాం ఉద్యమం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసగించారు. వాతావరణ మార్పులకు ఆ దేశాలే ప్రధాన కారణమని తెలిపారు. వాతావరణ మార్పుల్లో భారత్ పాత్ర చాలా చిన్నదని తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్, నమామి గంగ, ఒకే సూర్యుడు`ఒకే ఇంధన వ్యవస్థ వంటి పథకాలతో బహుహుఖంగా పర్యావరణ పరిరక్షణకు భారత్ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం స్వచ్ఛభారత్, నమామీ గంటే లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని వెల్లడించారు. సారవంతమైన మట్టిపై భారత్ రైతుల్లో అవగాహన అంతగా లేదన్న ప్రధాని సాయిల్ హెల్త్ కార్డుల్ని ఇవ్వడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యమని తెలిపారు.













