ప్రధాని మోదీ ఆస్తులు 2.85 కోట్లు…
గత ఏడాదితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తులు పెరిగాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆస్తులు మాత్రం తగ్గాయి. ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి మోదీ, షా సహా కేంద్ర మంత్రుల ఆస్తుల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. 2019లో రూ.2.49 కోట్లు ఉన్న 70 ఏళ్ల మోదీ ఆస్తి 2020 నాటికి రూ.2.85 కోట్లకు పెరిగింది. బ్యాంకు బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడి వల్లే మోదీ ఆస్తుల్లో రూ.36 లక్షల పెరుగుదల కనిపించింది. ప్రధాని లైఫ్ ఇన్ఫూరెన్స్ (ఎల్ఐసీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు (ఎన్ఎస్సీ), బాండ్ల ద్వారా పన్ను మినహాయింపు కోసం ప్రయత్నించారు.
మోదీ ఇంతవరకు ఎలాంటి అప్పులూ తీసుకోలేదు. ఆయన పరు మీద సొంత వాహనం కూడా లేదు. గాంధీనగర్లోని సెక్టార్ 1లో 3,531 చదరపు గజాల ఓ ప్లాటు ఉంది. ఉమ్మడి ఆస్తి అయిన ఆ ప్లాటుకు మోదీతో పాటు నలుగురు ఉమ్మడి హక్కుదారులు. 2020 అక్టోబరు సమయంలో ఈ ప్లాటు ధర రూ.13 లక్షలు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమిత్షా ఆస్తుల్లో తగ్గుదల కనిపించింది. షేర్ మార్కెట్ పడిపోవడంతో తన ఈక్విటీల విలువ తగ్గిందని షా పేర్కొన్నారు. 2019 మార్చి 31న రూ.32.3 కోట్లు ఉన్న షా ఆస్తి ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.28.63 కోట్లకు పడిపోయింది. ఆయనకు గుజరాత్లో 10 చోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తన తల్లి నుంచి వచ్చిన ఈ ఆస్తుల విలువ రూ.13.56 కోట్లు.













