ప్రపంచాధినేతల్లో ప్రధాని మోదీకి ప్రథమ స్థానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ రేటింగ్ సర్వే డేటా ప్రకారం 13 మంది గ్లోబల్ లీడర్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక రేటింగ్ కలిగి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడోర్ 64 శాతంతో రెండో స్థానంలో నిలువగా, ఇటలీ ప్రధాని మారియో డ్రాగ్నీ 60 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. ఇక జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 52 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 48 శాతం ఓట్లతో ఐదో స్థానంతో సరి పెట్టుకున్నారు. అఫ్గాన్‌లో బలగాల ఉపసంహరణ, తాలిబన్ల ఆక్రమణ వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు ఐదో స్థానానికి పడిపోయారు.













