జవాన్ లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న సైనికులతో ఉండటం కంటే గొప్ప దీపావళి వేడుక తనకు మరేదీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రధాని ఈ ఏడాది కూడా జవాన్ లతో కలిసి వేడుకలు చేసుకున్నారు. ఇందుకోసం కార్గిల్ చేరుకున్న మోదీ అక్కడి సైనికులతో ముచ్చటించారు. సైనికులే తమ కుటుంబమని, అందుకే పండగకు ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఈ విజయవంతమైన కార్గిల్ భూమి నుంచి దేశ ప్రజలకు, ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కార్గిల్ విజయ పతకాన్ని ఎగురవేయకుండా పాకిస్థాన్‌తో ఏ ఒక్క యుద్ధం కూడా జరగలేదు. దీపావళి అంటే చెడుకు ముగింపు పలుకుతూ చేసుకునే పండగ. కార్గిల్ దాన్ని సుసాధ్యం చేసింది. కార్గిల్‌లో మన సైన్యం తీవ్రదాన్ని అణిచివేసింది అని మోదీ తెలిపారు.













