కేంద్రం కీలక నిర్ణయం.. ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
దేశ పౌరుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కార్యాలయంలో జరిగిన వర్చువల్ ఈవెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాన్ని ప్రారంభించారు. గత ఏడాది ఆగస్ట్ 15న జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా దేశ ప్రజలకు హెల్త్ కార్డ్‌లతో పాటు హెల్త్ ఐడీలను అందించనున్నారు. వీటి ఆధారంగా ప్రజలు హెల్త్ ఇన్ఫర్మేషన్ను ఆయుష్మాన్ డిజిటల్ వెబ్ సైట్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.













