ప్రధాని మోదీ బర్త్‌డే గిఫ్టుల ఈ-వేలం.. ఎప్పుడు మొదలవుతుందంటే?
భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా లభించిన బహుమతులను వేలం వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మోదీ బర్త్‌డే సందర్భంగా పలువురు ప్రముఖులు బహుమతులు అందజేసిన సంగతి తెలిసిందే. వీటిని శనివారం నుంచి ఆన్లైన్లో వేలం వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ బహుమతులను ఈ-వేలంలో ఎవరైనా కొనుగోలు చేయవచ్చని కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2019 నుంచి ఇలా ప్రధానికి అందిన బహుమతులను వేలం వేస్తున్నట్లు చెప్పారు. ఈసారి మొత్తం 1222 బహుమతులకు వేలం జరుగుతున్నట్లు వివరించారు. ఇవి కనీసం రూ.2.7 కోట్ల ధర పలుకుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానికి నీరజ్ చోప్రా వంటి పలువురు క్రీడాకారులు ఇచ్చిన 25 బహుమతులు, వారి టీషర్టులు కూడా వేలంలో ఉన్నాయని తెలియజేశారు. ఈ వేలం ద్వారా వచ్చే నిధులను ‘నవామి గంగ’ కోసం ఉపయోగిస్తారని పేర్కొన్నారు. గతంలో మోదీ తను ధరించిన డ్రెస్‌ను వేలంలో ఉంచగా.. అది ఏకంగా రూ.3 కోట్ల ధర పలికి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.













