ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. వారణాసీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మోదీ మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు.