ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. వారణాసితో పాటు దక్షిణాదిలో!
ఉత్తరాదిలో బీజేపీ గెలుపొందినంత సులభంగా దక్షిణాదిలో మాత్రం కాషాయపార్టీ ప్రభావం చూపలేకపోతోంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమిపాలైంది. దీంతో, దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి. వారణాసి స్థానంతో పాటు దక్షిణాదిలో మరో చోట నుంచి ప్రధాని బరిలో నిలబడతారని సమాచారం. దక్షిణాదిలో బీజేపీ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులోని ఓ నియోజకవర్గం నుంచి మోదీ పోటీ చేయనునన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కొన్ని నెలల క్రితం నిర్వహించిన కాశీ తమిళ సంగమం కార్యక్రమం వల్ల తమిళనాడుతో ఆయన అనుబంధం బలపడిరదని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వారణాసితో పాటు కన్యాకుమారి లేదా కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.













