ప్రధాని మోదీ బెంగాల్ టూర్ క్యాన్సిల్
ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ పర్యటన రద్దైంది. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ శుక్రవారం బెంగాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా పెరుగుతున్న నేపథ్యం, ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే బెంగాల్ పర్యటన రద్దైందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘కరోనా పరిస్థితిని సమీక్షించడానికి శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ కారణంగానే బెంగాల్ ప్రచారానికి నేను వెళ్లడం లేదు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
దేశ వ్యాప్తంగా కరోనా పెరుగుతున్న నేపథ్యంలో బెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జరిగే ప్రతి సభ కేవలం 500 మందితోనే నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే 6 దశల పోలింగ్ పూర్తైంది. మిగిలింది కేవలం మూడు దశలు మాత్రమే. ఈ మూడు దశలూ కేవలం టెక్నాలిజీని ఉపయోగించుకుంటూ ప్రధాని మోదీ ప్రచారం చేస్తారా? అన్నది చూడాలి. ఒకవేళ అదే నిర్ణయం గనక తీసుకుంటే ప్రధాని మోదీ బెంగాల్ సభలు ఇక ముగిసినట్లే.













