అమెరికా అధ్యక్షుడితో కలిసి ప్రారంభిస్తా : మోదీ
పర్యావరణ పరిరక్షణకు అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. వాతావరణ మార్పులపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన వివిధ దేశాల నేతల శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, తాను ఇండియా-యూఎస్ క్లైమాట్ అండ్ క్లీన్ ఎనర్జీ అజెండా 2030 పార్టనర్షిప్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. పర్యావరణంపై గ్లోబల్ సమ్మిట్ సమయంలో ఒప్పందాన్ని ప్రకటిస్తామని మోదీ తెలిపారు. అయితే ఈ భాగస్వామ్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంది. పర్యావరణ బాధ్యత కలిగి అభివృద్ధి చెందుతున్న దేశంగా సుస్థిరాభివృద్ధి భాగస్వామ్యం కోసం భారత్ సిద్ధంగా ఉంది. తక్కువ మొత్తానికే గ్రీన్ ప్లైనాన్స్, క్లీన్ టెక్నాలజీ పొందాలనుకుంటున్న ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా భాగస్వామ్య దేశాలు సాయంగా ఉంటాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
అధ్యక్షుడు జో బైడెన్, తాను ఇండియా-యూఎస్ క్లైమాట్ అండ్ క్లీన్ ఎనర్జీ అజెండా 2030 పార్టనర్షిప్, ఆరంభిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు, స్వచ్చ టెక్నాలజీ, హరిత ఒప్పంద సహకారాలను తాము ప్రభావితం చేయబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ది పరంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ క్లీన్ ఎనర్జీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ, అటవీకరణ, జీవవైవిద్యంపై అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాం. ఈ కారణంగానే ఎన్డీసీ (నేషనలీ డిటర్మైన్డ్ కంట్రీబ్యూషన్స్)లు 2 డిగ్రీ సెల్సియస్ ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్ ఉందని చెప్పారు. భారత్ తలసరి కార్బన్ ఉద్గారాల నిష్పత్తి 60 శాతం కంటే తక్కువగా ఉంది. అంతర్జాతీయ సగటు కంటే ఇది తక్కువగా ఉందని వివరించింది. భారతీయుల జీవన విధాన సుస్థిర సాంప్రదాయక విధానంలో కొనసాగుతుండడమే దీనికి కారణమని చెప్పారు.













