జూన్ 1న కాశీ ప్రజలు… సరికొత్త రికార్డు : మోదీ

జూన్ 1న జరిగే లోక్‌సభ ఎన్నికల ఏడో దశ పోలింగ్‌కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తన దృష్టిలో కాశీ నగరం భక్తి, శక్తి, వినియోగానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రపంచానికి సాంస్కృతిక రాజధాని అని వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాశీ ప్రతినిధిగా బాబా విశ్వనాధ్‌తో పాటు కాశీ వాసులు ఆశీస్సులు కోరుతున్నానని చెప్పారు. ఈసారి కాశీ ఎన్నికలు నవకాశీ ఏర్పాటు కోసమే కాదని, అభివృద్ధి చెందిన భారత్ ఆవిష్కరణకు కీలకమని అన్నారు. జూన్ 1న కాశీ ప్రజలు నూతన రికార్డును నెలకొల్పాలని కోరారు. గత పదేండ్లుగా కాశీ సంక్షేమం, అభివృద్ధి కేంద్రంగా వర్దిల్లుతున్నదని చెప్పారు. నా నామినేషన్ రోజున ఇక్కడి యువత ఉత్సాహం చూశానని, ఇప్పుడు ఇదే ఉత్సాహం ప్రతి బూత్‌లోనూ కనిపించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు.