కరోనాపై పోరులో మనమెంతో మెరుగు: మోదీ
కరోనాపై పోరాడుతున్న దేశాల్లో భారత్ అత్యంత మెరుగ్గా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రికవరీ రేటు సైతం పెరిగిందని పేర్కొన్నారు. రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ మార్ థోమా మెట్రోపాలిటన్ 90వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ భారతదేశంపై కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఈ ఏడాది మొదట్లో కొందరు అంచనా వేశారు. ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయడం, కట్టడికి చర్యలు తీసుకోవడం, ప్రజలు సహకరించడంతో వైరస్‌పై పోరాడుతున్న దేశాల్లో భారత్ అత్యంత మెరుగైన స్థానంలో ఉంది. మన రికవరీ రేటు పెరుగుతోంది అని చెప్పారు. డాక్టర్ జోసెఫ్ మార్థోమా దేశం, సమాజం మెరుగయ్యేందుకు తన జీవితం అంకితం చేశారు. పేదరిక నిర్మూలన కోసం ఆయన కఠోరంగా శ్రమించారు. మహిళా సాధికారత కోసం పోరాడారు అని మోదీ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశ విదేశాలకు చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.













