ఆనంద్ మహీంద్రా కీలక నిర్ణయం…మీరందరూ కూడా
ప్రముఖ వ్యాపార దిగ్గజం సైరస్ మిస్త్రీ రోర్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో పలు విషయూలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో కారు చాలా వేగంగా ప్రయాణిస్తోందని తెలిసింది. అంతే కాదు ఆ సమయంలో వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్ట్రీ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని తేలింది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కీలక నిర్ణయం తీసకున్నారు. కారు వెనుక సీట్లో కూర్చున్నా సరే సీట్ బెల్టు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. మీరందరూ కూడా వెనుక సీట్లో ఉన్నప్పుడు కూడా సీటు బెల్టు పెట్టుకుంటామనే ప్రతిజ్ఞ తీసుకోవాలని సూచించారు. మన కుటుంబాలకు మనం ఎంతో రుణపడి ఉన్నామని, మనం ప్రాణాలతో ఉండటం మన కుటుంబాలకు చాలా అవసరమమని మహీంద్రా అన్నారు.













