అయోధ్య రాములోరికి హైదరాబాద్ నుంచి… ముత్యాల హారం
అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కీలక భాగస్వామ్యం పోషిస్తూ హైదరాబాద్ మహానగరం నుంచి ప్రత్యేకతలను చాటుకుంటోంది. ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అద్భుతమైన తరుణంలో విశిష్టమైన ఆభరణాలు, వస్తువులు, ప్రసాదాలు, పూజా సామాగ్రి ఇక్కడి నుంచే వెళ్లడం తెలంగాణ ప్రతిష్ఠను మరింతగా పెంపొందిస్తోంది. ఇక అయోధ్య రాముడికి ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ వారు హైదరాబాద్ నుంచి మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు హారం వెల్లనుంది. తొమ్మిది మంది కళాకారులతో తొమ్మిది రోజుల్లో తయారు చేశారు. ముంబై నుంచి తెప్పించిన ముత్యాలతో తయారీ చేశారు. మూడు కిలోల 600 గ్రాముల ముత్యాలు, అరకిలో పచ్చల మణులతో హారం ప్రవళ జువెలర్స్ అండ్ జేమ్స్ తయారు చేశారు. ఈ ముత్యాల హారం ప్రతి ఒక్కరికి ఆకట్టుకుంది.













