నిరుపేద విద్యార్థికి అరుదైన ఘనత.. రూ. 2.5 కోట్ల ఉపకారవేతనం
బిహార్ రాజధాని పట్నాకు చెందిన 17 ఏళ్ల నిరుపేద విద్యార్థికి అరుదైన ఘనత సాధించారు. పుల్వారి షరీఫ్ గ్రామవాసి అయిన ప్రేమ్‌కుమార్ నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యార్థి. తండ్రి రోజూవారీ కూలీ. ఆ కుటుంబంలో చదువుకోవడానికి వెళ్లిన మొదటి వ్యక్తి ప్రేమే. ప్రస్తుతం శోశిత్ సమాధాన్ కేంద్రంలో 12వ తరగతి చదువుతున్న ప్రేమ్ మెకానికల్ ఇంజినీరింగ్, అంతర్జాతీయ సంబంధాలపై ఉన్నత విద్యా అవకాశాన్ని సంపాదించాడు. అమెరికాలోని ప్రతిష్ఠాత్మక లఫాయెట్టే కళాశాలలో ఉన్నత విద్య చదువుకోడానికి రూ.2.5 కోట్ల ఉపకారవేతనం పొందాడు. వెనుకబడిన వర్గాలకు సేవ చేయాలనే మీ నిబద్ధత బాగుందంటూ ఆ కశాశాల డీన్ మాథ్యూ హైడ్ అభినందన లేఖ పంపించారు. ఈ ఉపకార వేతనంతో నాలుగేళ్ల చదవుతో పాటు అక్కడ నివసించడానికి సరిపోయేటంత డబ్బును ఇస్తారు. ప్రతిష్ఠాత్మక డైర్ ఫెలోసిప్కు ప్రపంచవ్యాప్తంగా ఆరుగురు అర్హత సాధించగా అందులో భారత్ తరపున ప్రేమ్‌కుమార్ ఒకరు.













