ఐపీఎల్ స్పాన్సర్ బరిలో పతంజలి
ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో, ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. వివోతో ఐపీఎల్ కు ఐదేళ్ల కాంట్రాక్టు ఉంది. ఇందుకోసం వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఒప్పందం 2022లో ముగియనుంది. ప్రస్తుతం భారత్-చైనా మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్ షిప్ నుండి వివో సంస్థ వైదొలిగింది. బీసీసీఐ ఈ ఏడాది కొత్త స్పాన్సర్ కోసం ఎదురుచూస్తోంది. బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి సంస్థ కూడా ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్ షిప్ ను సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.













