ఐ పి ఎల్ కి స్పాన్సర్ గా పతంజలి
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయం లో సమయం లో బోర్డు అఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారత్ చైనా దేశాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం లో భాగంగా ఇప్పటికే భారతదేశం చైనా యాప్స్ అన్నిటినీ నిషేధించ గా, ఈ క్రమంలో చైనీస్ ఉత్పత్తులను బహిష్కరించే అవకాశం ఉన్నందున గత వారం బిసిసిఐ మరియు చైనా మొబైల్ తయారీ సంస్థ వివో 2020 ఐపిఎల్ (IPL) లో తమ గస్వామ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి అని తెలిసింది. టైటిల్ స్పాన్సర్షిప్ అనేది ఐపిఎల్ యొక్క వాణిజ్య ఆదాయంలో ముఖ్యమైన భాగం అవ్వడంతో వివో సంస్థ 2018 నుంచి 2022 వరకు ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ ని రూ .2,190 కోట్లు కు వేలం లో దక్కించుకోగా ఇప్పుడు యోగా గురు రాందేవ్ బాబా పతంజలి ఆయుర్వేద్ సంస్థ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ కోసం ఐపిఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ వేలం లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు పతంజలి ప్రతినిధి ఎస్ కె టిజరవాలా తెలిపారు.
పతంజలి సంస్థ తన ఆయుర్వేద ఆధారిత ఎఫ్ఎంసిజి ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించినందున ఈ చర్య హరిద్వార్ ఆధారిత సంస్థ పతంజలి గ్లోబల్ మార్కెటింగ్ లో తమ ఉత్పత్తుల ప్రచారం చేయడానికి సహాయపడుతుంది మరియు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) సోమవారం 10 ఆగస్టు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదించగా ఆగస్టు 14 లోగా తన ప్రతిపాదనను సమర్పించాల్సి ఉందని ఆయన వివరించారు.
అయితే బీసీసీఐ అత్యధిక మొత్తంలో కోట్ చేసినవాళ్లకి వేలం దక్కుతుంది అని అపోహ పడొద్దు అని ఫలితాలు ఆగస్టు 18 వెల్లడిస్తాం అని తెలిపారు.













