ఎన్డీఏ కూటమికి షాక్.. కేంద్ర మంత్రి పశుపతి రాజీనామా
లోక్‌సభ ఎన్నికలకు బిహార్‌లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఇందులో చిరాగ్ పాసవాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్) పార్టీకి బీజేపీ ఐదు సీట్లు కేటాయించింది. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురైన చిరాగ్ బాబాయి, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఇటీవల ఎన్డీయే విస్తరణలో భాగంగా చిరాగ్ మళ్లీ కూటమిలో చేరగా తాజా సర్దుబాటులో ఆ పార్టీకి ఏకంగా అయిదు సీట్లు బీజేపీ కేటాయించిది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుతం ప్రాతినిధ్యం హాజీపుర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పరాస్‌కు ఇప్పుడు కూటమిలో సీట్లు దక్కలేదు. ఇది ఆయనను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. విపక్ష ఇండియా కూటమిలో చేరనున్నట్లు పరాస్ మీడియాకు వెల్లడిరచారు.













