ఫేస్‍బుక్, గూగుల్ కు.. మరోసారి సమన్లు

ఫేస్‍బుక్ ఇండియా, గూగుల్ ఇండియాకు ఐటీ పార్లమెంటు స్థాయీ సంఘం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ప్యానెల్ జూన్ 29వ తేదీన కమిటీ ముందు హాజరు కావాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. పౌరుల హక్కులను రక్షించడం, ఆన్‍లైన్ న్యూస్ మీడియా దుర్వినియోగం అంశంపై ఎఫ్‍బీ, గూగుల్ సంస్థల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కమిటీ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆన్‍లైన్‍లో మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో సహా, పౌరుల హక్కులను రక్షించడం, ఆన్‍లైన్ న్యూస్ మీడియా దుర్వినియోగం అంశంపై ఫేస్‍బుక్, గూగుల్ సంస్థల అభిప్రాయాలను కమిటీ సేకరించనుంది. రెండు సంస్థలకు చెందిన ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కమిటీ తన ఆదేశాల్లో పేర్కొంది.