జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను ప్రకటించారు మొత్తం రెండు విడతల్లో 66 రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయని ప్రహ్లాద్ జోషీ తెలిపారు. ఈ అమృత కాలంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, బడ్జెట్, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు.













