మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు… జమిలితో
జమిలి ఎన్నికల పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని అన్నారు. జమిలితో దేశ ప్రజలకే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న కోవింద్ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఒకే దేశం-ఒకే ఎన్నికకు మద్దతు తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికల ఆలోచనకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను రామ్‌నాథ్ కోవింద్ కోరారు. ప్రజలు దీని నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతారని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా కూడా కేంద్రంలో ఉన్నవారికి కూడా మేలు జరుగుతుందని వివరించారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.













