పాన్, ఆధార్ గడువు… మరో మూడు నెలలు

ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్నస్ దాఖలు చేయడంలో కీలకమైన ఆధార్, పాన్ కార్డు అనుసంధాన పక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. అంటే సెప్టెంబర్ 30 వరకు పాన్ కార్డు దారులు తమ ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవచ్చు. ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ గడువును మరో దఫా పొడిగించింది. పాన్-ఆధార్‍తో పాటు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. అలాగే సొంతింటిపై పెట్టుబడి పెట్టే వారికి పన్ను మినహాయింపును మూడు నెలలకు పైగా పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వివాద్ సే విశ్వాస్ పథకం గడువును మరో రెండు నెలలు అంటే ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.