ఢిల్లీ హింసలో 80 మంది పోలీసులకు గాయాలు
రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా తలెత్తిన హింసలో 80 మంది పోలీసులు గాయాలపాలయ్యారు. ఈ పోలీసులందర్నీ ఢిల్లీలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు మంగళవారం ట్రాక్టర్ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ సందర్భంగా పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కారణంగానే 80 మంది పోలీసులు గాయపడ్డారు. ఢిల్లీలోని లోక్ నాయక్ జైప్రకాశ్ ఆస్పత్రిలో 38 మంది పోలీసులకు చికిత్స అందిస్తున్నారు. సివిల్ లైన్ ఆస్పత్రిలో 11 మందిని, అరుణ అలీ ఆస్పత్రిలో 8 మందిని, తీర్థరామ్ ఆస్పత్రిలో 4 మందిని… ఇలా వివిధ ఆస్పత్రుల్లో గాయపడ్డ పోలీసులకు చికిత్స అందిస్తున్నారు.













