మూడేళ్లలో పౌరసత్వం వదులుకున్న భారతీయులు.. ఎందరో తెలుసా?
గత మూడేళ్లలో 3,92,643 మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వాన్ని వదలుకున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో వెల్లడించారు. 2019లో 1,44,017 మంది, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తెలిపారు. ఈ మూడేళ్లలో 1,70,795 మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నట్లు చెప్పారు. ఇదేసమయంలో కెనడా పౌరసత్వాన్ని 64,071 మంది, ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని 58,391, యూకే పౌరసత్వం 35,435 మంది తీసుకున్నట్లు తెలిపారు. ఈ నాలుగు దేశాల పౌరసత్వం తీసుకున్న మొత్తం భారతీయు సంఖ్య 3,28,692 (83.71శాతం) మేర ఉన్నట్లు వెల్లడించారు.













