రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో సభ తరపున, తన తరపున అభినంనదలు తెలియజేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. పరిపాలన అనుభవం ఉన్న దేశంలోని దీర్ఘకాల నాయకులలో ఖర్గే ఒకరు అని వెంకయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గులాం నబీ ఆజాద్ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా ఇటీవల కాలం వరకు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఆజాద్ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 15తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆజాద్ స్థానంలో ఖర్గే పేరును కాంగ్రెస్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఆయన ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.













