ఆత్మ నిర్భర్ భారత్ పట్ల ఒప్పోకు అంకితభావం
కొవిడ్-19 విస్తృతికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తప్పని సరిగా భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివిధ రంగాలపై ప్రభావాన్ని చూపింది. వ్యాపార జీవనోపాధి ఒక సవాలుగా మారడం, పలు సంస్థలు తమ టాస్క్ ఫోర్స్‌లో ఎక్కువ భాగం రిమోట్‌గా పని చేస్తున్న నేపథ్యంలో తమ డిజిటలైజేషన్ ప్రయాణాన్ని వేగంగా ట్రాక్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చాయి. తక్కువ కాలంలోనే ఇటువంటి మృదువైన మార్పిడి కష్టమే అయినప్పటికీ, మనం అభివృద్ధి చెందుతున్నప్పుడు, టెలికాం, ఉత్పాదక రంగం, ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమలు ఈ కారణంతోనే భారీ మార్పులకు సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ సమయంలో వ్యాపార సుస్థిరతను కొనసాగించేందుకు సంస్థలు, భారత ప్రభుత్వం, పరిశ్రమలు, వినియోగదారులు, వాటిలో వాటాదారుల సమిష్టి కృషి అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది.
దేశంలో పని చేస్తూ, తయారవుతూ, అక్కడి పౌరులకు ఉపాధి అవకాశాలను కల్పించే వాటినే భారతీయ బ్రాండ్లుగా నిర్వచించవచ్చు. అటువంటి సంస్థలు భారతదేశం పట్ల తమ నిబద్ధతను బలోపేతం చేసేందుకు ఇదే సరైన సమయం. ఒప్పో ఇండియా ఇప్పటి అవసరాన్ని అర్థం చేసుకుంది మరియు గ్లోబల్ బ్రాండ్‌గా నిలిచేందుకు కావడం ఆత్మ నిర్భర్‌గా నిలిచేందుకు ఈ విప్లవాత్మక మార్పుకు సహకరించేందుకు కావలసిన నైపుణ్యాన్ని అందిస్తోంది. భారతదేశంలో తాను పని చేస్తున్న మార్కెట్‌పై దృష్టి సారించిన ఒప్పో ఇండియా దేశాభివృద్ధికి కట్టుబడి, దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు వృద్ధికి ఆవిష్కరణలు మరియు ఎంటర్‌ప్యూనర్‌షిప్ కీలకమని గుర్తించింది.
‘‘మేక్ ఇన్ ఇండియా’’ పట్ల తన నిబద్ధతను మరింత బలోపేతం చేసేందుకు ఒప్పో నిరంతరం శ్రమిస్తూ వస్తోంది మరియు గ్రేటర్ నోయిడా తయారీ కేంద్రంలో ₹2,200 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా, ఏటా 50 మిలియన్ల స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేయడానికి వారికి సహాయపడడమే కాకుండా, స్థానిక సముదాయాల్లో పలు ఉపాధి అవకాశాలను సృష్టించింది.
తయారీ మరియు ఆవిష్కరణ అనే రెండు దశల్లో స్థానిక సముదాయంతో పరస్పరం చర్చించుకోవడం కీలక పాత్రను పోషించడం అవసరమని బ్రాండ్ అర్థం చేసుకుంది. ఒప్పో ఇండియా తన అభివృద్ధి, పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్‌లో 2018 అక్టోబర్‌లో ప్రారంభించింది మరియు భారతీయ వినియోగదారులు, మార్కెట్ నుంచి లోతైన అవగాహనను పొందడంపై తన దృష్టిని కేంద్రీకరించింది. దీనితో భారతదేశంలో కేంద్రీకృత ఆవిష్కరణలు మరియు అనుకూలీకరించిన ఉత్పత్తి ఆఫర్లు – అందుబాటు ధరలో 5 జి ఉపకరణాలు, ఇండియా లోకల్ సొల్యూషన్స్, కెమెరా ఆవిష్కరణలు, ఫాస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్ తదితరాలను అందించగలిగింది. ఈ అభివృద్ధి మరియు పరిశోధన కేంద్రం విస్తృతమైన భారతీయ ఆర్&డి నైపుణ్యాలను బ్రాండ్ ఒడిసి పట్టుకునేందుకు సహాయపడింది. దీనితో తద్వారా విదేశీ మార్కెట్లలో పెరుగుతున్న వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా తక్షణమే స్పందించేందుకు ఇది సహకరించింది.
భారత ప్రభుత్వం మరియు వివిధ రాష్ట్రాల మద్దతుతో ఒప్పో తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడం సాధ్యమైంది. స్థానికంగా ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలను తయారు చేసేందుకు ఈ బ్రాండ్ గ్రేటర్ నోయిడాలో గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) ఏర్పాటు చేసింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఐటి మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మద్దతు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదించడంతోనే ఇది సాధ్యమైంది. దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో గణనీయమైన మార్పులు తీసుకు వచ్చే వినూత్న పరిష్కరణలను ప్రోత్సహించేందుకు సహ-అభివృద్ధికి ఒప్పో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
అక్షరాస్యత, నైపుణ్యాలను, తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగు పరచేందుకు ప్రభుత్వం మరియు వ్యాపార సంస్థలు అన్ని స్థాయిల్లో కలిసి పని చేయవలసిన అవసరం ఉంది. భారతదేశంలో చక్కని ప్రతిభ ఉంది మరియు కొందరు బహుళ నైపుణ్యాలను కలిగిన కళాకారులు ఉండగా, ఆయా వ్యక్తులకు తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు సరైన వేదిక అవసరం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా లావాదేవీల నిర్వహణతో ఒప్పో వంటి బ్రాండ్లు ఈ ప్రతిభావంతులైన వ్యక్తులను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రపంచ స్థాయికి తోడ్కొని వెళ్లి పరిచయం చేసేందుకు సహాయపడుతున్నాయి మరియు ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న నిపుణుల నుంచి సలహాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
మనం, ఒక దేశంగా కలిసి చేయగలమని విశ్వసించాలి. వ్యక్తి, బ్రాండ్ మరియు ప్రభుత్వాల ఏకీకృత అలానే సహకార ప్రయత్నాలు భారతదేశాన్ని ‘ఆత్మ నిర్భార్’గా మారుస్తాయి.













