శ్రీరామ నవమి సందర్భంగా… అయోధ్య రామాలయానికి

ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల కోసం 1,11,111 కిలోల లడ్డు ప్రసాదాన్ని పంపనున్నట్లు దేవ్‌రహా బాబా ట్రస్టుకు చెందిన ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు. కాశీ విశ్వనాథ్, తిరుపతి శ్రీవారి ఆలయంతో పాటు మరికొన్ని పుణ్యక్షేత్రాలకూ ట్రస్టు తరపున ప్రతి వారం లడ్డూ ప్రసాదాన్ని పంపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య రామాలయానికి 40 వేల కిలోల లడ్డును పంపినట్లు పేర్కొన్నారు.