లాక్డౌన్ పై… సీఎం కేజ్రీవాల్ ప్రకటన
దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారి నివారణకు కొత్త ఆంక్షలు అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు నుంచి పది రోజులకు సరిపడా కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం కరోనా నాలుగో వేవ్ కొనసాగుతుందని తెలిపారు. తమకు తగినంత మోతాదులో వ్యాక్సిన్లను అందించినట్లు అయితే.. ఎక్కువ సంఖ్యలో టీకా కేంద్రాలను ఓపెన్ చేస్తామన్నారు. రెండు, మూడు నెలల్లో వ్యాక్సిన్ పక్రియను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.













