ప్రవాసీయులకు తీపికబురు
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కరోనా, లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన ప్రవాసీయులకు 3 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారు. ఆయన తన 47వ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్ ద్వారా ఈ ప్రకటన చేశారు. ఉపాధి కోల్పోయిన ప్రవాసీయులను ఆదుకునేందుకు సోను సూద్ ప్రత్యేకంగా ప్రవాస్ రోజ్గార్.కామ్ అనే వెబ్సైట్ను ప్రారంభించారు. ఎన్నో పెద్ద కంపెనీలు ఆయనతో చేతులు కలిపాయి. ఉపాధి కోల్పోయిన వారికి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి. ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొచ్చిన ఏఈపీసీ, సిటీ, ట్రెడెండ్, క్వెస్, కార్ప్, అమెజాన్, సొడెక్సో తదితర కంపెనీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.













