భారత స్వాతంత్ర వేడుకలకు.. ఒలింపియన్ లు
టోక్యో 2020 ఒలింపిక్స్ లో భారత్కు ప్రాతినిథ్యం వహించిన అథ్టెట్లు ఈ ఏడాది భారత స్వాతంత్య్ర వేడుకలకు విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు. ఈ మేరకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ, భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) ఏర్పాట్లు చేస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ నుంచి 120 మంది అథెట్లు పాల్గొన్నారు. ఏడుగురు అథెట్లు పతకాలతో స్వదేశానికి తిరిగొచ్చారు. కోవిడ్ 19 ఆర్టీపీసీఆర్ పరీక్షల పరీక్షల అనంతరం అశోక హోటల్లో బస చేయనున్న అథ్లెట్లు స్వాతంత్య్ర వేడుకల అనంతరం రాష్ట్రపతి భవన్లో ప్రథమ పౌరుడిని కలువనున్నారు. ఆగస్టు 16న ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీతో ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేయర్ సాయ్ షెడ్యూల్ను విడుదల చేసింది.













