ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అరుదైన ఘనత సాధించింది. దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసును వెనక్కి నెట్టి ఆయన ఈ ఘనత సాధించారు. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఇప్పటికే సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిటే ఉన్నది. ఆయన 1994 డిసెంబర్ 12 నుంచి 2019 మే 27 వరకు 24 ఏండ్లుకుపైగా ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ 2000 మార్చి 5న తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 23 ఏండ్ల 138 రోజులుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు.
బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5 వరకు 23 ఏండ్ల 137 రోజులపాటు పదవిలో కొనసాగారు. చామ్లింగ్, జ్యోతిబసు తర్వాత వరుసగా ఐదుసార్లు ముఖ్యమంత్రి అయిన మూడో నేత నవీన్ పట్నాయక్ కావడం విశేషం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ విజయం సాధించిన పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయితే, అత్యధిక కాలం సీఎంగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు.













