బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. అది ప్రేమకు చిహ్నం కాదు దాన్ని కూల్చేయాలి
ఢిల్లీలోని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌పై అస్సా బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. జోర్హాట్ జిల్లా మరియాని నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రూపజ్యోతి కుర్మీ మాట్లాడుతూ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నం కాదని వ్యాఖ్యానించారు. షాజహాన్ తన నాలుగో భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ను నిర్మించాడు. ఒకవేళ ముంతాజ్ అంటే షాజహన్కు అమితమైన ప్రేమ ఉంటే ఆమె చనిపోయిన తర్వాత మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు అని ప్రశ్నించారు. అంతేగాక నాలుగో భార్య అయిన ముంతాజ్ మహల్ ప్రేమకు తాజ్ మహల్ నిదర్శనంగా భావిస్తే మిగతా ముగ్గురు భార్యలకు ఏమైందని ప్రనశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక మొఘల్ పాలకుడు జహంగీర్ 20 సార్లు వివాహం చేసుకున్నాడు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే తాజ్‌మహల్ నిర్మించిన మరో చక్రవర్తి షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. రాబోయే తరాలకు అలాంటి సమాచారాన్ని అందించాలని కోరుకోవడం లేదు. ఎన్సీఈఆర్టీ తాజాగా మొఘల్‌లపై పాఠ్యాంశాలను తగ్గించాలని తీసుకున్న నిర్ణయంపై మేము మద్దతు ఇస్తున్నామని తెలిపారు.













