యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం..అనుమతి లేకుండా
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన తర్వాత ఆయన కొన్ని మార్గ దర్శకాలను పేర్కొన్నారు. ఈద్, అక్షయ త్రితియ పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త ఆదేశాలను రిలీజ్చేశారు. అనుమతి లేకుండా ఎటువంటి మతపరమైన ర్యాలీలు, యాత్రలు చేపట్టరాదు అని సీఎం యోగి ఆదేశించారు. శాంతి భద్రతలు కాపాడుతామని నిర్వహకులు ర్యాలీలో అనుమతి కోసం ఆఫడవిట్ సమర్పించాలని యోగి తెలిపారు. మతపరమైన సాంప్రదాయ ఉత్సవాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, కొత్త తరహా ఈవెంట్లకు అనుమతి ఉండదని యోగి తెలిపారు. రాష్ట్ర ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
ఇటీవల శ్రీరామ నవమి, హానుమాన్ జయంతి శోభయాత్రల సందర్భంగా పలు రాష్ట్రాల్లో అల్లురు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మత ఘర్షణలపై కేంద్రం మౌనంగా ఉండడాన్ని తప్పుబడుతూ 13 పార్టీలు ఈ అల్లర వెనుక ఉన్నవాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో యూపీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యోగి ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. వేళ పలు రాష్ట్రాల్లో అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.













