లోక్‌సభలో ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
క్రిప్టో కరెన్సీపై రకరకాల ఊహాగాల నడుమ బిట్ కాయిన్ భవితవ్యంపై పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది కేంద్ర ప్రభుత్వం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి నిర్మలా సీతారామన్. బిట్‌కాయిన్ లావాదేవీలకు చెందిన డేటాను ప్రభుత్వం సేకరించడం లేదన్నారు. అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టో బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. బిట్‌కాయిన్ లావాదేవీల నియంత్రణ కోసం రెగ్యులేటరీ వ్యవస్థ అవసరం అన్న అభిప్రాయాన్ని ఇటీవల కేంద్రం వ్యక్తం చేసింది. అయితే బ్యాంక్ ఓటు అన్న నిర్వచనాన్ని మారుస్తూ, దాంట్లో డిజిటల్ కరెన్సీని కూడా జోడిరచే విధంగా ఆరీబీఐ చట్టాన్ని సవరించాలని ఇటీవల కేంద్రాన్ని ఆర్బీఐ కోరిన విషయం తెలిసిందే.













