కేంద్రం ప్రకటనతో ఆశావహుల్లో నిరాశ
తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభా లెక్కల అనంతరమేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఆయా పార్టీల నుంచి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న నేతల ప్రయత్నాలకు గండి పడినట్లుయింది. తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగే శాసనసభ ఎన్నికలకు ప్రస్తుతమున్న 119 నియోజకవర్గాలు 153కు, ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో 175 స్థానాలకు 225 పెరుగుతాయని తద్వారా ఎన్నికల బరిలో ఉండవచ్చన్న నేతల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభా లెక్కల తర్వాతనే అని లోక్సభలో హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటన అనంతరం ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకున్న నేతలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













