భారత విద్యార్థులకు కొత్త చిక్కులు… ఆన్లైన్ క్లాసులు చెప్పం
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి స్వదేశానికి తిరిగివచ్చిన భారత విద్యార్థులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. భారత వైఖరి పట్ల అసహనంతో ఉన్న ఉక్రెయిన్ ప్రొఫెసర్లు తమకు ఆన్లైన్లో తరగతులు చెప్పడానికి నిరాకరిస్తున్నారని ఉత్తరాఖండ్ వైద్య విద్యార్థులు ఆరోపించారు. తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందన్నారు. రష్యా పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరితో అసహనంగా ఉన్న ఉక్రెయిన్ ప్రొఫెసర్లు భారత వ్యతిరేక ఆలోచనా ధోరణిని తమపై ప్రదర్శిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లోని వైద్య కళాశాలల్లో చేరడానికి తమకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.













