ఇండియా కూటమికి మరో షాకిచ్చిన కేజ్రీవాల్
సార్వత్రిక ఎన్నికల ముంగిట విపక్ష ఇండియా కూటమికి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆప్ మరో షాకిచ్చింది. పంజాబ్‌లో కూటమితో ఎలాంటి పొత్తు ఉండదని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. చండీగఢ్‌తో సహా మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 15 రోజుల్లోగా ఈ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తుంది అని తెలిపారు. సీట్ల సర్దుబాటుపై సందిగ్ధం వీడకపోవడంతో పంజాబ్ విషయంలో ఇదివరకే ఆప్ ఈ తరహా ప్రకటన చేసింది. తాజాగా దీనిపై కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు.
మరోవైపు అస్సాంలో మొత్తం 14 లోక్‌సభ నియోజకవర్గాలకు గానూ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దిబ్రుగఢ్ నుంచి మనోజ్ దానోవర్, గుహహటి, తేజ్‌పుర్ స్థానాల నుంచి భాబెన్ చౌదరి, రిషిరాజ్ కౌంటిన్యలు పోటీ చేస్తారని వెల్లడించింది. ఈ మూడు కాంగ్రెస్‌కు మంచి పట్టున్న స్థానాలే కావడం గమనార్హం.













