నాకు అటువంటి ఆలోచన లేదు : నితీశ్ కుమార్
ప్రధాని పదవిపై తనకు ఆసక్తి లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నిలకు ముందు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నానని నితీశ్ తెలిపారు. బీజేపీ, ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ బీహార్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని పదవిపై తాను దృష్టి పెట్టవచ్చనే వార్తలను ఆయన ఖండిరచించారు. చేతులు జోడిరచి చెబుతున్నా. నాకు అటువంటి ఆలోచనలు లేవు. అందరి కోసం పని చేయడమే నా పని. ప్రతి పక్షాలన్నీ కలసి పని చేసేలా కృషి చేస్తాను. వాళ్లు కూడా ఇదే పని చేస్తే బాగుంటుందని అని నితీశ్ స్పష్టం చేశారు.













