కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా
2024 ఎన్నికల తర్వాత ఒకవేళ బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించనున్నట్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. పట్నాలో ఓ కార్యక్రమంలో నితీశ్ మాట్లాడుతూ ఒక్క బీహార్‌కు మాత్రమే కాదు, అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, అప్పుడు కేంద్ర పథకాలకు 90:10 శాతం నిధులను కేటాయించడం జరుగుతుంది. ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు దీని ద్వారా లాభం జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మణిపూర్, మేఘలయా, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ ఉంది.













