2024 నాటికి అమెరికాకు దీటుగా యూపీ
ఉత్తరప్రదేశ్ లోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. లఖ్‌నవూలో జరిగిన ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ 81వ సదస్సులో రోడ్ల నిర్మాణంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు రూ.8000 కోట్ల విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రహదారులను అగ్రరాజ్యానికి దీటుగా తీర్చి దిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ.5.లక్షల కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, వినూత్నత, భద్రత, నాణ్యత, వంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి జరగాలని గడ్కరీ పేర్కొన్నారు.













