గడ్కరి యూట్యూబ్ ఆదాయం ఎంతో తెలుసా?
యూట్యూబ్‌లో తాను పోస్టు చేసే వీడియోలకు మంచి ఆదరణ లభిస్తోందని, దీంతో ప్రతీ నెల 4 లక్షల రూపాయల రాయల్టీ అందుతోందని కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో తాను చేసిన వీడియో ప్రసంగాలకు వ్యూయర్ షిప్ బాగా పెరిగిందన్నారు. గుజరాత్‌లోని భరూచ్‌లో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో తాను ఇంట్లో వంట చేసే వాడినని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విదేశాల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పానని తెలిపారు.













