అనంత్-రాధికల పెళ్లి వేళ…అంబానీ కుటుంబం మరో కీలక నిర్ణయం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చెంట్ పెళ్లి ముచ్చట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం, ప్రీవెడ్డింగ్ వేడుక అంగరంగా వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ముందస్తు పెళ్లి వేడుకలకు అంబానీ కుటుంబం సిద్ధమైంది. ఇందులో భాగంగా అంబానీ కుటుంబం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలు జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నారు. పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో జులై 2న సాయంత్రం ఈ కార్యక్రమం జరగనుంది. పేద కుటుంబాలకు చెందిన పలు జంటలకు ఇందులో సామూహిక పెళ్లిళ్లు జరిపించనున్నారు. ఈ వేడుకలకు ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. ఇటీవల గుజరాత్‌లో జరిగిన ప్రీవెడ్డింగ్ వేడుకల సమయంలోనూ అంబానీ కుటుంబం సమీప గ్రామ ప్రజలకు అన్న సేవను నిర్వహించిన సంగతి తెలిసిందే. పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ కుమార్తె రాధికతో అనంత్ అంబానీ వివాహం జులై 12న జరగనుంది.