దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా… నిర్మలా సీతారామన్
అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబీనీ చోటు దక్కించుకున్నారు. ఫార్చ్యూన్ ఇండియా దేశంలోని అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. టాప్ 10లో కిరణ్ మజుందార్ షా నంబర్ నాలుగో స్థానం, ఆ తర్వాతి స్థానాల్లో అరుంధతీ భట్టాచార్య, గీతా గోపీనాథ్ వంటి వారు ఉన్నారు. 2020 మార్చిలో లాక్డౌన్లో అమల్లోకి వచ్చిన 36 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మొదటి క్యాబినెట్ మంత్రిగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరును ఫార్చ్యూన్ ఇండియా వెబ్సైట్లో పేర్కొంది. ప్రభుత్వ ప్రణాళిక, కోవిడ్‌తో ఎలా వ్యవహరించాలో దేశం మొత్తం తెలుసుకునేలా చర్యలు చేపట్టారు. అలాగే ఆర్థిక వ్యవస్థ వృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని నివేదిక తెలిపింది. నీతా అంబానీ దార్శనికత, నాయకత్వం కారణంగా కంపెనీ కోవిడ్ 19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో విజయవంతమైంది.













