కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ .. వారి కోసం కొత్తగా
మధ్య తరగతికి కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్ స్కీమ్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బస్తీల, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, పీఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన పీఎం ఆవాస్ యోజన గ్రామీణ కరోనా కాలంలోనూ కొనసాగిందని తెలిపారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని తెలిపారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు తెలిపారు.













