కేంద్ర ఆర్థికమంత్రి కీలక ప్రకటన
కరోనా వైరస్ టీకా కోసం దేశమంతా ఎదురు చూస్తున్న వేళ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్ 19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన, అభివృద్ధి కోసం 900 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక మంత్రి ప్రకటించారు. మూడవ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఈ నిధులను ఆమె వెల్లడించారు. వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు వినియోగించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సృష్టం చేశారు. కోవిడ్ సురక్షా మిషన్ పేరుతో ప్రకటించిన ఈ పథకం కోసం బయోటెక్నాలజీ విభాగానికి ఈ నిధులను అందించినట్టు చెప్పారు. రూ.2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపనలో ఇవి భాగమని తెలిపారు.













