లోక్ సభ బరిలో కేంద్ర మంత్రులు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే అవకాశాలు ఉన్నాయి. కర్నాటక నుంచి ఆ ఇద్దరూ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆ ఇద్దరూ ఇక లోక్‌సభకు పోటీ చేయాలని బీజేపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే నిర్మల, జైశంకర్‌కు తగిన స్థానాలను వెతికే పనిలో పడినట్లు తెలుస్తోంది. కర్నాటక నుంచి నిర్మల, గుజరాత్ నుంచి జైశంకర్‌లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణ కన్నడ స్థానం నుంచి నిర్మలను పోటీకి దించాలని భావిస్తున్నారు. ఇక బెంగళూరు సౌత్ లేదా బెంగుళూరు సెంట్రల్ నుంచి జైశంకర్‌ను నిలబెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.













