కొత్త లుక్‌లో సెంట్రల్ విస్టా అవెన్యూ…. సెప్టెంబర్ 8న
దేశ రాజధాని ఢిల్లీ లోని రాజ్‌పథ్ ఇప్పుడు కొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నది. సెంట్రల్ విస్టా అవెన్యూను ఇప్పుడు మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. సెంట్రల్ విస్టాకు చెందిన ఫోటోలను తాజాగా రిలీజ్ చేశారు. రీడెవలప్ చేసిన ఆ ప్రాంతం ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఐస్ క్రీం బండ్లు, వీధి వ్యాపారుల కోసం కూడా కొత్త వెండింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. సెంట్రల్ విస్టా అవెన్యూ సుమారు రెండు కిలోమీటర్ల పొడువు ఉంటుంది. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సెంట్రల్ విస్టాను అద్భుతంగా తయారు చేశారు. సెప్టెంబర్ 8వ తేదీన ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ప్రజల సందర్శనకు ఉంచుతారు.













