నెట్ఫిక్స్ సంచలన నిర్ణయం .. ఇకపై అలా చేయడం కుదరదు
ఓటీటీ సంస్థల్లో రారాజుగా వెలుగుతున్న నెట్ఫిక్స్ పాస్వర్డ్ షేరింగ్ విషయంలో కీలక ప్రకటన చేసింది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పాస్ వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్లో నిలిపివేసినట్లు ప్రకటించింది. ఇకపై కుటుంబ సభ్యులు మాత్రమే పాస్వర్డ్ను షేర్ చేసుకునేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్ఫ్లిక్స్ తన యూజర్లకు మెయిల్స్ పంపింది. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇతరులతో పాస్వర్డ్ షేర్ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తమ కస్టమర్ల అభిరుచి మేరకు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి టీవీషోలు, కొత్త సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు నెట్ఫిక్స్ తెలిపింది. అయితే, చందాదారుల కుటుంబ సభ్యులు ఎక్కడికైనా వెళ్లినప్పుడు, ప్రయాణ సమయంలో కూడా ఓటీటీ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. ఇంకా ప్రొఫైల్ను బదిలీ చేయడం లాగే యాక్సెస్, డివైజెస్ మ్యానేజ్ చేయడం వంటి కొత్త ఫీచర్ల ప్రయోజనాన్ని పొందవచ్చని తెలిపింది.













