4 రోజుల్లో 2 సార్లు… ప్రపంచ రికార్డు

మింగ్మా తెంజింగ్ శెర్పా నేపాల్‍కు చెందిన 43 ఏళ్ల ఈ మౌంటెన్ గైడ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో ఎత్తన పర్వతమైన ఎవరెస్టును తక్కువ వ్యవధిలో రెండుసార్లు ఈయన అధిరోహించాడని నిర్వాహకులు ప్రకటించారు. తూర్పు నేపాల్‍లోని సంకువాసభ జిల్లాకు చెందిన శెర్పా మొదట రోప్ ఫిక్సింగ్ టీం సభ్యుడిగా మే 7వ తేదీ సాయంత్రం ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరాడు. మళ్లీ మే 11వ తేదీ ఉదయం మరోమారు ఈ ఘనత సాధించాడు. ఈ యాత్రను ఏర్పాటు చేసిన సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ట్రావెల్ ఏజెన్సీకి శెర్పా అధ్యక్షుడు కూడా. రెండోసారి బహరీన్ రాకుమారుడు షేక్ మహమ్మద్ హమద్ మహమ్మద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని 16 మంది సభ్యుల బృందానికి హౌంటెన్ గైడ్‍గా వెళ్లి శెర్పా ఎవరెస్టు అధిరోహించాడు.